సగటు భారతీయుడి సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే. కాబట్టి మనలాంటి దేశాల్లో టెక్ కంపెనీలు, యాప్‌ల డార్క్ ప్యాటర్న్ పోకడలకు అడ్డులేకుండా పోతోంది. అవి ఉపయోగిస్తున్న మోసపూరిత డిజైన్ల వల్ల ప్రజల వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు సులభంగా సైబరాసురులకు చిక్కుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఉదాసీనతను విడనాడి మోసపూరిత డిజైన్లను ఉపయోగించే సంస్థలపై గట్టి చర్యలకు ఉపక్రమించాలి. వినియోగదారులు అత్యంత భద్రమైన అప్లికేషన్లు, యాప్‌లను ఉపయోగించడం మేలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa