గన్నవరం అంతర్జా తీయ విమానాశ్రయం నుంచి ముంబైకి ఇండిగో విమానం పునఃప్రారంభం అయింది. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి ముంబైకి బయలు దేరుతుంది. ఇందులో 106 మంది ప్రయాణికులు ముంబై వెళ్లారు. ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్నిల అభ్యర్ధన మేరకు ఇండిగో విమాన సంస్థ ముంబైకి మళ్లి సర్వీసును ప్రారంభించింది. ముంబైకి వెళ్లే ప్రయాణికులకు సర్వీసును అందు బాటులో ఉంచటమే లక్ష్యమని ఎంపీలు తెలిపారు. ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, కొలికపూడి శ్రీనివాసరావు, ఎయిర్పోర్టు అధికారులు పాల్గొన్నారు.