జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లోనే అన్ని చక్కపెట్టేసినట్లుగా ఒక అంచనాకు వచ్చిన అధికారులు..ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల లో ఉన్న భూములను భూ సమీకరణకు తీసుకొని కడప, పులివెందుల, కర్నూలు, దర్శి, కమలాపురం, జమ్మలమడుగు ప్రాంతాలలోని కొంతమంది వైసీపీ నాయకుల పేర్ల మీదకి ఈ ప్లాట్లు రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తుంది..సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ భూములకు భూ సమీకరణ ద్వారా ప్లాట్లు కేటాయించినట్లుగా ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది..రాజధాని గ్రామాలలో ప్రభుత్వ భూములుగా నమోదు కాబడిన సర్వే నెంబర్లలో భూమిని భూ సమీకరణకు ఇచ్చి కొందరు ప్లాట్లు పొందినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది.. RSR ప్రకారం ప్రభుత్వ భూములుగా కుంటలు, చెరువులుగా, పుంతలుగా, అటవీ భూములుగా మరియు కాలువలు, డొంక రోడ్లుగా అన్నోన్ ల్యాండ్స్ గా నమోదు కాబడిన భూములను కొందరు సిఆర్డిఏ అధికారుల కన్నుగప్పి ప్రభుత్వ భూములను భూ సమీకరణకు ఇచ్చి నివాస వాణిజ్య ప్లాట్లు పొందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది..ముఖ్యంగా ఇలాంటి అక్రమాలు నెక్కల్లు, అనంతవరం, నేలపాడు తుళ్లూరు, రాయపూడి గ్రామాలలో జరిగినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు..ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ల భూమిని ఇచ్చి పక్కన ఉన్న పట్టా సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారణ అయింది.అప్పటి సిఆర్డిఏ లో కొంతమంది అధికారులకు భారీ ముడుపులు అందినట్లుగా కూడా సమాచారం!పూర్తి ఆధారాలతో సిఆర్డిఏని, ప్రభుత్వాన్ని సంప్రదించిన ప్రముఖ న్యాయవాది.ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు.... పూర్తిస్థాయి విచారణకు ఆదేశించే అవకాశం..