ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా విజయవాడ బస్టాండ్ ప్రాంతాన్ని బ్లాక్ క్యాట్ కమాండో దళాలు చుట్టుముట్టాయి. చేతిలో ఉన్న గన్స్‌తో పొజిషన్ తీసుకుని బస్టాండ్‌లో ఆగి ఉన్న ఒక బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒక అగంతకుడిని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. బస్టాండ్‌లోని మొదటి అంతస్థులో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ఆక్టోపస్ దళాలు ప్రయణికులను దూరంగా పంపి తనిఖీ చేసి బాంబును నిర్వీర్యం చేశాయి.మరో చోట ఉగ్రవాదులు చొరబాటు చేశారన్న సమాచారంతో ఆక్టోపస్ దళాలు మెరుపువేగంతో దాడులు చేసి కాల్పుల్లో ఉగ్రవాదులు గాయపడినట్టు సృష్టించి ఆసుపత్రులకు తరలించాయి. ఇదంతా చూస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.బస్టాండ్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. తీరా అసలు నిజం తేలడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.బెజవాడ బస్టాండ్‌లో భద్రత పటిష్టతపై చర్యల్లో భాగంగా ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారని తెలుసుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, 35 మంది ఆక్టోపస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.