ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2024, 04:40 PM

సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంలోని ఒకరు సముద్రంలో గల్లంతు కాగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.గుడివాడ కు చెందిన ఆరుగురు సభ్యులు గల కుటుంబం కృష్ణా జిల్లా  కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్‌కు ఆదివారం వచ్చారు. సముద్రంలో వారంతా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలలకు సముద్రంలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్‌, బీచ్‌ మెరైన్‌ పోలీసులు వారిలో ఐదుగురిని ఒడ్డుకు చేర్చారు.అబ్దుల్ ముషారఫ్‌ అనే వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యడు. వీరిలో అబ్దుల్‌ ఫజల అనే మహిళ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. గల్లంతైన ముషారఫ్‌ కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com