అనంతపురం జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఆయన చాంబర్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అనంతపురం నియోజకవర్గ శాంతిభద్రతల పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.