వర్షాభావ పరిస్థితుల వల్ల రైతుకూ ఆదాయం తగ్గకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వాలని, సీమ జిల్లాల్లో సాగుకు దూరంగా ఉన్న రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించాము. రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలని, తక్షణమే ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించాలని ఆదేశించాము.