పశ్చిమ బెంగాల్లో జరిగిన విషాద ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఝర్గ్రామ్ ప్రాంతంలో ఆగస్టు 15న అడవి నుంచి ఏనుగుల గుంపు వచ్చింది. వాటి పట్ల కొందరు స్థానిక పౌరులు అమానవీయంగా ప్రవర్తించారు. అగ్ని గోళాలను, కాలుతున్న ఇనుప రాడ్లను ఏనుగులపైకి విసిరారు. ఈ దాడిలో గర్భంతో ఉన్న ఏనుగుకు తీవ్ర గాయాలు అయ్యాయి. నొప్పితో విలవిల్లాడుతూ ఆ ఏనుగు చనిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.