జిల్లాలో నడుపుతున్న హాస్టల్స్ కు బయటి నుండి ఆహారం అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ వసతీ గృహాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల రక్షిత గృహాలు, హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్ లలో చదువుకుంటున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని ఆదేశించారు.