ఎంపాక్స్ (మంకీపాక్స్) వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వైరస్ కొవిడ్ అంత భయంకరమైనది కాదని.. వ్యాధి వ్యాప్తిని నియంత్రిచొచ్చని తెలిపింది. ఎంపాక్స్ కొవిడ్ తరహాలో ప్రపంచ దేశాలన్నింటికి విస్తరిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో WHO స్పందించింది. మంకీపాక్స్ కొత్తదేం కాదు కాబట్టి ఇప్పటికే వ్యాక్సిన్ కూడా రెడీ చేశారు. రెండు రకాల వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ లిస్ట్ కూడా చేసింది.