సీతంపేట శాఖ గ్రంధాలయంలో మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయ సెక్రెటరీ బి కుమార రాజా పేర్కొన్నారు. గ్రంధాలయంలో అన్ని రకాల ఏర్పాట్లు సక్రమంగానే ఉన్నాయని ఆయన అన్నారు. కానీ గ్రంథాలయానికి సరైన రహదారి సౌకర్యం లేదని అన్నారు. గతంలో పిఓ రాహుల్ కుమార్ రెడ్డికి ఈ సమస్యను వివరించామని అన్నారు. గ్రంథాలయ అధికారి వివి శంకర్, బి గణేష్ బాబు పాల్గొన్నారు.