పాలకొండ మండలంలో వివిధ గ్రామాల్లో రైతులంతా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పంట క్షేత్రాల్లో తగ్గించాలని వెలుగు ఏపిఎం బాబురావు అన్నారు. వీటి స్థానంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు. బూర్జ వెలుగు కార్యాలయం వద్ద సేంద్రియ ఎరువులు, చీడ పీడల నివారణకు బ్రహ్మాస్త్రం తయారీ తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో మానవుని ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.