ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం చైర్మన్‌గా నూతన నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:47 PM

రాజమహేంద్రవరం జాంపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ పాలకవర్గం చైర్మన్‌గా బొమ్మన జయకుమార్‌, వైస్‌ చైర్మన్‌గా ఆర్‌.విజయశేఖర్‌ ఎన్నికయ్యారు. జాంపేట బ్యాంక్‌ ప్రధాన కార్యా లయంలో సోమవారం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌తో పాటు మరో 10 డైరెక్టర్ల చేత రాజమహేంద్రవరం డివిజనల్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌,ఎన్నికల అధికారి ఎం. జగన్నాథరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బాధ్యతలు స్వీక రించిన పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. కొత్తగా పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, విజయవాడలలో బ్రాంచిలు పెట్టడానికి రిజర్వు బ్యాంక్‌ అనుమతిచ్చిందని తెలిపారు. ఏపీ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ రాఘవేంద్రరావు మాట్లాడుతూ సహకార రంగం మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ రొబ్బి విజయశేఖర్‌, డైరెక్టర్లు ప్రసాదుల హరనాథ్‌,ఎం.లక్ష్మణరావు,జామిశెట్టిగాంధీ, ద్వారా పార్వతీ సుందరి, కనకం నాగేశ్వరరావు, బీరా శ్రీనివాసరావు, బూరా రామచంద్రరావు యాండ్రపు రామకృష్ణ, జామికృష్ణ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com