బోరుభద్రలో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న పురుగు మందుల దుకాణాన్ని సీజ్ చేసినట్లు టెక్కలి వ్యవసాయ శాఖ ఏడీ బీవీ తిరుమలరావు తెలిపారు. దుకాణంలో రూ. 31 వేల విలువైన పురుగు మందులను స్వాధీనం చేసుకుని దుకాణ యజమాని పంగ అప్పన్నపై సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో మండల ఇన్చార్జి ఏవో అప్పారావు, ఏఈవో సురేష్ తదితరులు పాల్గొన్నారు.