కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం1.633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1625.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 36,370 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 8,658 క్యూ సెక్కులు అని అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలుగా అని చెప్పారు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 78.803 టీఎంసీలు అని వివరించారు. మరోవైపు జిల్లాలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ఇంజనీర్లు అంచనా వేశారు.