డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాల మహానాడు బంద్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా నాయకులు ఆందోళన చేపడుతున్నారు. బస్సులను నాయకులు నిలిపివేశారు. అలానే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపు మేరకు సిద్ధిపేట బస్ డిపో వద్ద బస్సులు బయటకు రానీయకుండా పలు దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.