ఈనెల 28వ తేదీ బుధవారం పాలకొండ స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వద్ద ప్రొహిబిషన్ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వివిధ వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు వెయ్యి రూపాయల ధరావత్తు రుసుము చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని అన్నారు. వేలంపాటలో వాహనాలు దక్కించుకున్న వారు అదే రోజు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు.