శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును గురువారం లెక్కించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిపినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.మొత్తం 20 రోజుల్లో రూ.3,22,53,862 కోట్ల నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. నగదుతో పాటు 150 గ్రాముల 100 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 250 గ్రాముల వెండి వచ్చిందని పేర్కొన్నారు.వీటితోపాటు యూఎస్‌ఏ డాలర్లు 746, కెనడా డాలర్లు 125, ఆస్ట్రేలియా డాలర్లు 50, ఇంగ్లాండ్ పౌండ్స్ 70, సింగపూర్ డాలర్లు 26, యూఏఈ ధీర్హామ్స్ 50, యూరోలు 20, మలేషియా రింగేట్స్ 125, ఖతార్ రియాల్స్ 2, ఒమాన్ రియాల్స్ 1 మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించారు.