విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామివారి నిత్యాన్న ప్రసాదానికి బాలాజీ హిల్స్ వ్యూకు చెందిన బి. రామకుమార్, మౌనిక దంపతులు గురువారం విరాళం ప్రకటించారు. రూ. 1, 00,116 నగదు రూపంలో పీఆర్వో ఆఫీసులోని అన్నదానం కౌంటర్లో చెల్లించి రశీదు పొందారు..ప్రత్యేక సందర్భాల్లో వరాహ లక్ష్మీనృసింహస్వామికి అలంకరణకు వినియోగించాలని భక్తుడు కోరారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ ఆచారం ప్రకారం అధికారులు అంతరాలయంలో స్వామివారి దర్శనం కల్పించి, వారి గోత్రనామాలతో పూజలు జరిపించారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలు అందించగా.. ఆలయ ఏఈవో ఆనందకుమార్ దాతను శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.