రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఎంత అవసరమో.. కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడం అంటే అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై జిల్లాకు చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదకరం చాలా బాధాకరమని, దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎసెన్సియా ఫార్మా రెడ్ కేటగిరీ పరిశ్రమని, ఈ ప్రమాదంలో17మంది చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పరిహారాన్ని కంపెనీ ద్వారానే చెల్లిస్తున్నామన్నారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లో జన్ కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. కంపెనీ సరైన ఎస్‌వోపీ ఫాలో అవ్వలేదని స్పష్టమవుతుందన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, పరిశ్రమలు తప్పులు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూశామన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించామన్నారు.