అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో గాయపడిన క్షతగాత్రులను శుక్రవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా ఎస్పీ ఎం.దీపిక పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.