ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో సర్పంచులు బిచ్చమెత్తుకున్న పరిస్థితి వచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 04:51 PM

వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభలో పాల్గొన్నారు. ప్రజా నిర్ణయాలకు గ్రామసభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ పాలనలో సర్పంచులు సైతం బిచ్చమెత్తుకున్న దుస్థితిని చూశామని అన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సైతం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన అకౌంట్లోకి మళ్లించుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com