ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 23, 2024, 08:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రయాణికులకు మఖ్యమైన గమనిక. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 29వరకు విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.. కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారు. సాంకేతిక పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం-విజయవాడ (07896) (విజయవాడ, రామవరప్పాడు మధ్య) పాక్షికంగా రద్దు చేశారు. అలాగే విజయవాడ-మచిలీపట్నం (07769), నర్సాపూర్‌-విజయవాడ (07863), విజయవాడ-మచిలీపట్నం (07866), మచిలీపట్నం-విజయవాడ (07770), విజయవాడ-భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం-విజయవాడ (07870), విజయవాడ-నర్సాపూర్‌ (07861) రైళ్లను విజయవాడ, రామవరప్పాడు మధ్య రద్దు చేశారు.


 మరికొన్ని రైళ్లను విజయవాడ, గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం - పాట్నా (22643).. సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో భావనగర్ - కాకినాడపోర్ట్‌ (12756).. సెప్టెంబరు 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు - గౌహతి (12509) దారి మళ్లించారు. సెప్టెంబరు 2, 4, 6, 7, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ - భువనేశ్వర్‌ (11019).. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 29వరకు ధన్‌బాద్ - అలెప్పి (13351).. సెప్టెంబరు 5, 12, 19, 26తేదీల్లో టాటా, యశ్వంత్‌పూర్‌ (18111).. సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో జెసిది - తాంబరం (12376).. సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో హతియ - ఎర్నాకుళం (22837).. సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో హతియ - బెంగళూరు (18637).. సెప్టెంబరు 3, 8, 10, 15, 17, 22, 24, 29 హతియ - బెంగళూరు (12835).. సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీల్లో టాటా - హతియ (12889) రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com