తిరుమల తిరుపతి దేవస్థానం వేంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారంతా ఆయనకు వివిధ రకాల వస్తువులు సమర్పిస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమల వేంకటేశ్వర స్వామిని కనులారా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం లక్షల్లో వస్తుంటారు. ఆయణ్ను కల్లారా చూస్తే చాలు జీవితం ధన్యమని భావిస్తారు. ఈ క్రమంలో చాలా మంది తలనీలాలు సమర్పిస్తే మరికొంతమంది బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా ఇలా రకరకాల వస్తువులు స్వామివారి హుండీలో వేస్తుంటారు. అయితే వాటిని వేలం వేసేందుకు టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. కానుకలు సొంతం చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. అయితే కానులు ఏంటి, ఎప్పుడు వేలం నిర్వహిస్తారు, వేలంలో ఏఏ వస్తువులు పెట్టనున్నారో తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరో విషయం ఏంటంటే వేలాన్ని ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలంటూ టీటీడీ తెలిపింది.