రేషన్ కార్డు అనేది ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా మారిపోయింది. ప్రభుత్వం అందించే పథకాలే కాదు.. స్వచ్ఛంద సంస్థలు కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రేషన్ కార్డు ఆధారంగా సదరు వ్యక్తి ఆదాయాన్ని అంచనా వేస్తున్నాయి. అలాగే రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు, యువతకు తమకు చేతనైన సాయాన్ని చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రేషన్ కార్డు కలిగిన వారికి రూడ్ సెట్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా కారు డ్రైవింగ్ మీద శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నెలరోజులు పాటు అందించే ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితమని.. అలాగే ఈ 30 రోజుల కాలంలో భోజనం, వసతి కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తామని రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (రూడ్ సెట్) తెలిపింది.
అయితే ఇది అన్ని జిల్లాలకు కాదండోయ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యువకులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు ఈ అవకాశం కల్పించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకూ నెలరోజుల పాటు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పిస్తామని.. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని రూడ్ సెట్ డైరెక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ట్రైనింగ్‌తో పాటుగా వసతి, భోజనం కూడా ఉచితంగా అందిస్తామని ప్రకటనతో తెలిపారు. ఆసక్తి కలిగిన యువకులు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయి కాలేజీని సంప్రదించాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తమ వెంట తీసుకురావాలని సూచించారు. ఈ నెల రోజుల ట్రైనింగ్ ఒంగోలులోని రూడ్ సెట్ సంస్థలో ఉంటుందని తెలిపారు.
మరోవైపు రూడ్ సెట్ సంస్థను 1982లో స్థాపించారు. ప్రతి జిల్లాలోనూ దీని కార్యాలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కల్పించి వారి కాళ్లమీద వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో.. వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కారు డ్రైవింగ్, మెకానిక్ , సెల్ ఫోన్ రిపేరింగ్, కుట్లు, అల్లికలు, టైలరింగ్ ఇలా పలు అంశాలపై వీరు ఉచితంగా శిక్షణ అందిస్తుంటారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు ఈ ఫ్రీ కారు డ్రైవింగ్ ట్రైనింగ్ అవకాశం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa