ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అవినీతి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మైనింగ్ కార్యాలయాలు అన్నింటిలో రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నిన్న(శనివారం) మధ్యాహ్నం నుంచి రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు (ఆదివారం) కూడా అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. కొన్ని కార్యాలయాల నుంచి కీలక రికార్టులను తెప్పించుకుని వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే మరికొన్ని రికార్డులను సీజ్ చేసి ఏసీబీ అధికారులు తీసుకువెళ్లారు. 2021 నుంచి ఉన్న రికార్టులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. జేపీ వెంచర్స్ కాంటాక్ట్లు, తవ్వకాలు, చెల్లింపులపై ప్రధానంగా దృష్టి సారించారు. కొంతమంది అధికారులను రేపు (సోమవారం) ఏసీబీ కార్యాలయానికి రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.