అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రోగులు, వారి బంధువులు ఆస్పత్రి బయటకు పరుగులు తీశారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మంటలతో పాటుగా దట్టమైన పొగ విస్తరించడంతో రోగులు భయపడిపోయారు. ఏమైందోననే ఆందోళనతో ప్రాణాలు అర చేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అది కూడా బాలింతలు ఉన్న వార్డులో ప్రమాదం జరగటంతో మరింత ఆందోళన నెలకొంది. మంటలు, పొగ రావటంతో చంటిపిల్లలను తీసుకుని బాలింతలు బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది.
అయితే ఆదివారం ఉదయం నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి విద్యుత్ సరఫరా లేదు. కరెంట్ సరఫరా నిలిచిపోవటంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు. సూపరింటెండెంట్ ఆదేశాలతో చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలింతల వార్డులో ఉన్న విద్యుత్ మీటర్‌కు రిపేర్ చేస్తున్నారు. అయితే రిపేర్ చేస్తున్న సమయంలో కరెంటు తీగలు కాలిపోయాయి. దీంతో విద్యుత్ మీటర్ నుంచి మంటలు.. వాటితో పాటుగా దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో రోగులంతా మంటలు చెలరేగాయనే భయంతో బయటకి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలక్ట్రీషియన్‌కు గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అయితే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు.
మరోవైపు ఉన్నట్లుండి మంటలు రావటం, పొగ కమ్ముకోవటంతో బాలింతలు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థంకాక అయోమయానికి లోనయ్యారు. చంటిపిల్లలను ఎత్తుకుని ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఆ తర్వతా కొద్దిసేపటికి పొగ తగ్గిపోయింది. మంటలు ఆర్పివేశారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రిలోని వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన మెకానిక్‍ను ప్రస్తుతం విశాఖపట్నానికి తరలించారు.