ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అ­యి­దో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించిన ఓఎన్‌జీసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 09:48 PM

రాష్ట్రంలో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)  పెట్టుబడులు వాస్తవ రూపంలోకొస్తు­న్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసి­న్‌ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్‌జీసీ తాజాగా అ­యి­దో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ డీ–5 బ్లాక్‌లోని క్లస్టర్‌–2­లోని ఐదో బావి నుంచి విజయవంతంగా చ­ము­రును వెలికి తీసి­నట్లు ఆదివారం స్టాక్ ఎక్చ‌సైంజ్‌ లకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయ­డమే కాకుండా దా­న్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్ప­త్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్‌ ప్రొడక్షన్, స్టోరే­జ్, ఆఫ్‌ లోడింగ్‌ వెజల్‌ (ఎఫ్‌పీఎస్‌వో) ద్వా­రా సముద్రం నుంచి తీరానికి చేరు­స్తోంది. ఇందు­కోసం ఆర్మదా స్టెర్లింగ్‌–వీ ఫ్లోటింగ్‌ రిఫైనరీని ఓ­ఎన్‌జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్‌–2లో అభివృద్ధి చేస్తోన్న ఈ బా­వులు ద్వారా 23.52 మిలియన్‌ మె­ట్రిక్‌ టన్నుల చమురు, 50.70 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవు­తుందని ఓ­ఎన్‌జీసీ అంచనా. ఓఎన్‌జీసీ కేజీ బేసిన్‌లో మొత్తం చమురు సహజ వాయువు అన్వే­షణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్‌ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువు బావులను అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్‌  కేజీడీ–6 బ్లాక్‌కు కూత వేటు దూరంలోనే ఓఎన్‌జీసీ కేజీ–డీ5 బ్లాక్‌ను అభివృద్ధి చేస్తోంది. తీరానికి 35 కి.మీ దూరంలో 300–3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తోంది. బావులను 3 క్లస్టర్లుగా విభజించిన ఓఎన్‌జీసీ మొదటి రెండు క్లస్టర్‌ల్లోని బావులను అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్‌ నాటికి గ్యాస్‌ బావులతో పాటు మార్చి, 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాల­న్నది లక్ష్యం. ఇందుకోసం రూ.42,081 కోట్లను వ్యయం చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com