'కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుంది. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుంద'ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డి.ఏ.పి., ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి. రామ్ కుమార్ తూనికలు, కొలతల శాఖలో కొత్తగా వచ్చిన చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకి ఎక్కడా ఇబ్బంది కలుగకుండా, అన్నదాతకు భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. ధాన్యం సేకరణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర పకడ్బందీగా ప్రతి రైతుకీ అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధం అవుతున్నాం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో యూరియా, డీఏపీ ధరలు, కొలతల్లో తేడాలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతున్న విషయం దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల దుకాణాల వద్ద ఎంఆర్పీని రౌండ్ ఫిగర్ చేసి అమ్ముతున్నారు. రైతులు ఎంత కష్టపడి పంట పండిస్తున్నారో అందరికీ తెలుసు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర తీసుకోవడం అంటే మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతుంది. సేలర్స్, రిటెయిలర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తే మొదట రూ.160కి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మరో రూ.10 తగ్గించి రూ.150కి కేజీ ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. తయారీదార్లు, డీలర్లు రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి’. అని సూచించారు.