పాడేరు మండలంలోని అల్లివరం గ్రామ ఎమ్.పి. పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. విద్యార్థిని, ఎలా చదువు తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలు తింటున్న భోజనాలు రుచిగా ఉన్నాయా లేదా అని పరిశీలించి, విద్యార్థులతోనే కలిసి భోజనం చేశారు. అలాగే భోజనాలు క్వాలిటీగా ఉన్నాయి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్, ఎంఈవో,ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.