రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)కు పెంచింది. భద్రతకు ముప్పు తలెత్తే అవకాశాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం మోహన్ భగవత్‌కు భద్రత పెంచాలని ఆగస్టు 16న ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్‌కు లభిస్తుంది.