ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెత్తను తొలిగించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 11:00 PM

విజయనగరం జిల్లా, పాలకొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తను తక్షణమే తొలగించాలని పాలకొండ పట్టణ పౌర సంఘాల ఐక్యవేదిక నాయకుడు దావాల రమణారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆ ప్రాంత ప్రజలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నగర పంచాయతీ మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా రమణారావు మాట్లాడుతూ పట్టణంలోని చెత్తను తీసుకొచ్చి కార్యాలయం ముందు వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కార్యాలయంతో పాటు గ్రంథాలయం, చేపల మార్కెట్‌ కాయగూరల మార్కెట్‌కు వెళ్లి వచ్చేవారు దుర్గంధాన్ని భరించలేకపోతున్నారని చెప్పారు. తక్షణమే చెత్తను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో టి.జగదీష్‌, సతీష్‌, లలిత, భాను, రాజశేఖర్‌, శ్రీనివాసరావు తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com