ఏపీ కేబినెట్ భేటీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని మంత్రులతో అన్నారు. పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేవారు. ఇక మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, తమ తమ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని అన్నారు.ప్రభుత్వంలో కీలక మైన సమాచారం బయటకు పోతోందని చంద్రబాబు అన్నారు. శ్వేత పత్రాల్లో సమాచారం, ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడంపై ఆయనం విస్మయం చెందారు. ప్రభుత్వ శాఖల్లో వైసీపీ వేగులు ఉన్నారన్న అంశం కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించారు. కాగా ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యమని కొందరు మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది.