జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను ట్విట్టర్లో మోదీ పోస్టుచేశారు.
‘‘భారత్ కోసం క్రీడల్లో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి అభినందనలు చెప్పేందుకు ఇంతకుమించిన మంచి తరుణం మరొకటి ఉండదు. మా ప్రభుత్వం క్రీడలకు మద్దతుగా నిలుస్తూ.. యువతకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది’’అని వెల్లడించారు.