తనకు వచ్చిన మొదటి జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి.. మరోసారి తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. పేద క్రీడాకారులకు సహాయార్థం మంత్రి రెండవసారి తన జీతాన్ని విరాళంగా ప్రకటించారు. కాగా మంత్రి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తూ.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.