మద్యపానం, ధూమపానం వల్ల మాత్రమే కాలేయం దెబ్బతింటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆ అలవాట్లు లేని వారు కూడా రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం వారి జీవనశైలి, అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం.
అందులో ముఖ్యమైనది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి లివర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అలాగే ఫ్రైడ్ చికెన్, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన ఆహారం వల్ల కాలేయానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా సోడా, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లతో కూడా లివర్‌కు ప్రమాదమని చెబుతున్నారు.