ప్రభుత్వ ఉద్యోగులకు పాతపెన్షన్ విధానం తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురం లో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులకు కొత్త కొత్త పేర్ల తో పెన్షన్ పథకాలు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని విమర్శించారు