త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టబోతున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పటికే జోడో యాత్ర.. జోడో న్యాయ్ యాత్ర పూర్తి చేసిన రాహుల్ గాంధీ తాజాగా డోజో యాత్ర చేయబోతున్నట్టు ప్రకటించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. జోడో యాత్ర సమయంలో మేం వేల కిలోమీటర్లు ప్రయాణించాం. ఆ సమయంలో మా శిబిరాల వద్ద ప్రతిరోజు జివు-జిట్సూ (బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్)ను ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఫిట్‌గా ఉండేందుకు మేం ప్రారంభించిన యాక్టివిటీ త్వరలోనే అందరికీ చేరువైంది.
మేం బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఒకచోటకు చేర్చింది. మెడిటేషన్, జివూ-జిట్సూ, అకిడో (జపాన్ మార్షల్ ఆర్ట్స్), అహింసాపద్ధతితో ఘర్షణను పరిష్కరించే పద్ధతులు కలగలిసిన ఆర్ట్‌ను యువతకు పరిచయం చేయడమే లక్ష్యంగా వాటిని నిర్వహించాం. ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజం కోసం కావాల్సిన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని రాహుల్ పోస్టు పెట్టారు.