వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు వైయస్ జగన్ ఏనాడూ అన్యాయం చేయలేదని, అయినా తన మీద ఇలాంటి వార్తలు రావడం బాధాకరమని పిల్లి సుభాష్‌చంద్రబోస్ చెప్పారు. తాను నిరంతరం ప్రజలతోనే ఉంటానని, కాబట్టి ఎలాంటి సందేహాలున్నా నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ రకమైన వార్తల ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదని ఆగ్రహించారు. అధికారంలో లేకపోయినా.. పార్టీలోనూ, పదవుల విషయంలోనూ వైయస్ జగన్‌గారు ఎప్పుడూ తన ప్రాధాన్యత తగ్గించలేదని, అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. పదవుల కోసం తాను ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తిని కానని వెల్లడించారు.