ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఓర్వకల్లులో ఆయన లబ్ధిదారులకు నేరుగా పింఛన్లను అందజేయనున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న రచ్చకట్ట వేదికగా గ్రామ సభ నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల కు సీఎం ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో పించన్ల పంపిణీ గ్రామ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడే లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామ సభలో ప్రసంగిస్తారు. కాగా వర్షాల ప్రభావంతో కార్యక్రమం రద్దు అయ్యేలా ఉందని తాజా సమాచారం.