‘వర్షాలు, వరదల వల్ల తాగునీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగింది. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలి. కలుషిత ఆహారం ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించా అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏజెన్సీలో జ్వరాల బారిన పడిన గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలి. ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకుని సమన్వయంతో పనిచేయాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీ వాడండి. డిజాస్టర్ మేనెజ్‌మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలి. భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ పంపించాలి. విపత్తు వచ్చిన సమయంలో ప్రభుత్వం తమకు ఆదుకుంటుందనే నమ్మకం వారికి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలి.సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల కోసం ఆదేశాలు ఇచ్చా. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. అధికారులు బాధ్యతగా ఉండాలి అని’ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.