అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. దీనికి పాకిస్థాన్ సూచించిన ‘అస్నా’ అని పేరు పెట్టారు. ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు. అయితే సముద్రాలు వేడెక్కడంతో తుఫాన్ ఏర్పడింది. అరేబియా సముద్రంలో ఆగస్టులో 1891 నుంచి 1976 వరకూ మూడు తుఫాన్‌లు వచ్చాయి. ‘అస్నా’ నాలుగోది. గతంలో 1944, 1964, 1976 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో తుఫాన్‌లు వచ్చాయి.