విజయనగరం జిల్లా, రాజాం పట్టణంలో వికాశతరంగణి ఆధ్వర్యంలో శనివారం మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ హాజరై మట్టి విగ్రహాలు పంపిణీ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహారాలనే పూజించాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించిన వికాశతరంగణి సభ్యులను అభినందించారు.