సామాజిక భద్రత ఫించన్లు పంపిణీ ప్రభుత్వ బాధ్యతని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, మత్స్య, పశు సంవర్థక, డైయిరీ అభివృద్ధి శాఖా మాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శనివారం టెక్కలి మండలం రావివలసలో మాట్లాడుతూ టెక్కలి నుండి రావివలసకు వచ్చే రహదారిని మంజూరు చేసి, త్వరలోనే శంఖుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. మూలపేట పోర్టు నుండి విశాఖపట్నం వరకు తీరప్రాంతం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.