ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామన్నారు.
ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. 9ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్ మొత్తం 17 బృందాలు 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.