సాధారణంగా నిద్రించే సమయంలో అనేక కలలు వస్తాయి. అయితే ఆ కలలకు.. మన జీవితానికి ముడి పడి ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. తేలు కలలో కనిపిస్తే మనకు సమస్యలు ఎదురవుతాయి.
కానీ వాటి నుంచి మీరు తప్పించుకుని విజయం సాధిస్తారని దీని అర్థం. అదే తేలు కుట్టినట్టు, మీరు ఏడుస్తూ బాధ పడుతున్నట్లు కల వస్తే మాత్రం మీకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయని గుర్తు పెట్టుకోవాలి. మీకు భవిష్యత్తులో కష్టాలు ఎదురవుతాయని, ఆర్థిక నష్టాలు ఎదుర్కొవాలని అర్థం.