అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అన్ని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వర్షాల కురుస్తున్న వేళ మున్సిపాలిటీలలో వర్కర్లు పనిచేయాలని, పంచాయతీలలో డ్రైన్లు శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై చెత్త నిలువ లేకుండా చూడాలన్నారు.