ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరుపవద్దన్న అయ్యన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 04:18 PM

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించడం తెలిసిందే. వర్షాలు, వరదల ప్రభావంతో 9 మంది మృతి చెందారు. విజయవాడలో 2.76 లక్షల మంది వరద బాధితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే రేపు (సెప్టెంబరు 4) నా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నా అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి వేడుకలు జరుపవద్దు. ఆ ఖర్చుతో వరద బాధితులకు సహాయం చేయాలని నా మనవి" అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com