ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 5న మరో అల్పపీడనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 07:34 PM

ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న తరుణంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కోస్తా మీదుగా కొనసాగుతోందని, రాష్ట్రంలో చెదురు మదురుగా వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa