ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకూ వరదల్లో చిక్కుకున్న 43,417మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముంపు ప్రాంతాల్లో 197 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. సహాయక చర్యల్లో 48 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.